LUPIN THE 3rd vs. CAT'S EYE
హితోమీ, రుఈ, ఐలు అక్కచెల్లెళ్లు, దొంగ పిల్లులు. వాళ్ళొక పెయింటింగ్ ని మ్యూజియం నుంచి దొంగిలించినప్పుడు, ల్యూపిన్ ద 3 మరొక పెయింటింగ్ దొంగిలించడానికి వస్తాడు.ఈ రెండు పెయింటింగులు మైకేల్ హైంజ్ సీరీస్ ‘‘ ద గర్ల్ అండ్ ద ఫ్లవర్స్’’ లో ఒక భాగం. ఈ అమ్మాయిలకి ఈ పెయింటింగ్ తమ మాయమైన తండ్రిని కనుక్కునే మార్గం. ల్యూపిన్ కూడా దీనినే దొంగిలించడానికి బయల్దేరాడని తెలిసినప్పుడు, వాళ్లలో ఒక ఉత్సాహం రగులుతుంది.